పన్ను ఆధారిత సమస్యల పరిష్కారానికి 'వివాద్ సే విశ్వాస్' పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దీనిద్వారా పన్ను చెల్లింపుదారులు, స్వీకరణదారుల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ఈ పథకం పరిధిలోకి విదేశాల్లో వివాదం కేసులూ వస్తాయని ఆదాయపన్ను శాఖ తెలిపింది.
విదేశాల్లోనూ 'వివాద్ సే విశ్వాస్' సేవలు - vivad se vishwas scheme details
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన 'వివాద్ సే విశ్వాస్' పథకం విదేశాల్లోని వివాదం కేసులను పరిష్కరిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. విదేశాల్లోని పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాలను పరిష్కరిస్తుందని స్పష్టం చేసింది.
ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి ఈ పథకం సువర్ణావకాశం వంటిదని ఐటీ శాఖ వెల్లడించింది. జనవరి 31 లేదా అంతకన్నా ముందు దాఖలైన పిటిషన్లు, రిట్‌లు ఈ పథకానికి అర్హమైనవని ఐటీ శాఖ తెలిపింది. ఇప్పటికే చెల్లించిన పన్నులకు సంబంధించిన వివాదాలు కూడా దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేసింది.
పన్నులు, పెనాల్టీలు, వడ్డీ ఫీజులు, టీడీఎస్, టీసీఎస్ వివాదాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 'వివాద్ సే విశ్వాస్' పథకాన్ని ప్రకటించారు.