టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో సేవలు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్(సీసీఓ) వినోద్ కన్నన్ ప్రకటించారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విమాన సంస్థలను ప్రస్తుతం 55శాతం వరకు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అయితే.. ఏప్రిల్ నాటికి పరిస్థితుల్లో మార్పు వస్తుందని.. అప్పుడు పూర్తిస్థాయిలో విమాన సేవలు అందిస్తామని చెప్పుకొచ్చారు కన్నన్. ప్రస్తుతం తాము ఎలాంటి ఆర్డర్లను రద్దు చేయడంలేదన్న సీసీఓ.. కొత్త విమానాల టైమ్‌లైన్‌ను మాత్రమే మార్చినట్టు వెల్లడించారు.
విస్తారాలో.. 51శాతం భాగస్వామ్యంతో టాటా గ్రూప్ యాజమాన్యం వహిస్తోంది. మిగతా 49 శాతం సింగపూర్ ఎయిర్‌లైన్స్ పంచుకుంది.