తెలంగాణ

telangana

వర్చువల్​ గేమ్​తో వస్తున్న అవెంజర్స్​ హీరోలు

By

Published : Sep 7, 2019, 9:19 PM IST

Updated : Sep 29, 2019, 7:58 PM IST

అవెంజర్స్​లో కనిపించిన మార్వెల్​ హీరోల పాత్రలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సినిమాల్లోని మార్వెల్​ పాత్రలను ఇప్పుడు వర్చువల్​ రియాలిటీ వీడియోగేమ్​ రూపంలో పరిచయం చెయ్యనుంది డిస్నీ సంస్థ. ఇందుకోసం ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజం లెనోవాతో భాగస్వామ్యం కానుంది.

వర్చువల్​ గేమ్​తో వస్తున్న అవెంజర్స్​ హీరోలు

వర్చువల్​ గేమ్​తో వస్తున్న అవెంజర్స్​ హీరోలు

అవెంజర్స్​ సినిమాతో మార్వెల్​ పాత్రలను మన ముందుకు తీసుకొచ్చిన డిస్నీ.. మరో ముందడుగు వేసింది. ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజం లెనోవా భాగస్వామ్యంతో మార్వెల్​ పాత్రలను వర్చువల్​ రియాలిటీ వీడియోగేమ్​ రూపంలో తీసుకురానుంది.

గతంలో పోకీమ్యాన్​ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ తరహా గేమ్​ ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు అవెంజర్స్​ హీరోలతో పరిచయం చెయ్యనుంది డిస్నీ. దాదాపు ఆరు ఐకానిక్​ మార్వెల్​ హీరోలు, వారికి ఉన్న శక్తులు, ఆయుధాలు ఇప్పుడు మీ చేతుల్లోనూ ఉంటాయి. నిజంగా ప్రత్యర్థి ముందున్నట్లు కనిపిస్తుంది. ఎంతో మంది గేమ్​​ ప్రియులను ఈ తరహా టెక్నాలజీ ఆకట్టుకుంటుదని లెనోవా తెలిపింది.

లెనోవా ఈ గేమ్​ ఆడటానికి ఏఆర్​ హెడ్​సెట్​, హ్యాండ్​ కంట్రోలర్స్​ ఉపయోగించనుంది. వాటి సాయంతో థార్​ సుత్తెను ప్రత్యర్థుల మీదకు విసిరేయచ్చు. బ్లాక్​ పాంథర్​ పంజా దెబ్బ రుచి చూపించవచ్చు. భవిష్యత్తులో విడుదల చేసే వర్చువల్​ రియాలిటీ గేమ్​లనూ ఆడే విధంగా హార్డ్​వేర్​ను రూపొందించినట్లు తెలిపింది లెనోవా.

''ఇప్పుడు మీరు థార్​గా మారచ్చు. ఒక చేత్తో సుత్తె పట్టుకొని, మరో చేత్తో పిడిగుద్దులు విసురుతూ ప్రత్యర్థులను మట్టుపెట్టచ్చు. కెప్టెన్​ మార్వెల్​లా మీ చెతుల్లో నుంచి ఫోటాన్​ కాంతిని ప్రసరిస్తూ వాటిని లేజర్స్​గా మార్చేయచ్చు. బ్లాక్​ పాంథర్​ మాదిరిగా మీ పంజాలు.. శత్రువులను చంపేందుకు సహాయపడతాయి. అలాగే డాక్టర్​ స్ట్రేంజ్​లా కూడా మారచ్చు.''

-వాహిద్​ రజలి,లెనోవా ప్రొడక్ట్​​ మార్కెటింగ్​ మేనేజర్​

ఇదీ చూడండి:బొమ్మకోసం 2 ఊళ్ల గొడవ.. నల్ల రంగుతో దాడులు

Last Updated : Sep 29, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details