పలాయనంలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని వార్తలు వచ్చినా.. అది ఇప్పట్లో జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. బ్రిటన్ ప్రభుత్వం తాజాగా మరో మెలిక పెట్టింది. చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే.. పంపిస్తామని బ్రిటన్ హై కమిషన్ స్పష్టం చేసింది.
అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. అది రహస్యమని చెబుతున్న బ్రిటన్ హై కమిషన్.. యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాల్యాను ఇప్పట్లో భారత్‌కు రప్పించడం సాధ్యమేనా... అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.
బ్రిటన్ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో మాల్యాను భారత్‌కు తీసుకొచ్చి.. సీబీఐ, ఈడీ కస్టడీలోకి తీసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. యూకే చట్టాల్లోని నిబంధనలు మాల్యాకు వరంగా మారాయి.