తెలంగాణ

telangana

ETV Bharat / business

లండన్​లో విజయ్​ మాల్యాకు 'చోర్ ​హై' షాక్ - హై

లండన్​లో జరిగిన భారత్​- ఆస్ట్రేలియా మ్యాచ్​ చూసేందుకు వెళ్లిన లిక్కర్​ కింగ్​ విజయ్ మాల్యాను పలువురు 'చోర్​ హై' అంటూ చుట్టుముట్టారు. భారత్​కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

లండన్​లో విజయ్​ మాల్యాకు 'చోర్ ​హై' షాక్

By

Published : Jun 10, 2019, 5:40 AM IST

భారత్‌ ఆస్ట్రేలియా మధ్య జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన కింగ్‌ఫిషర్‌ యజమాని విజయ్‌ మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. తన తల్లితో కలిసి భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం బయటికి వచ్చిన మాల్యాను పలువురు చుట్టుముట్టారు. 'చోర్‌ హై' అంటూ నినాదాలు చేశారు. భారత్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అయితే 'చోర్‌ హై' నినాదాలపై స్పందించిన మాల్యా.. ఇలాంటి వాటిని తన తల్లి అస్సలు పట్టించుకోరని తెలిపారు. భారత బ్యాంకుల్లో వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో లండన్​లో తలదాచుకుంటున్నారు మాల్యా.

ABOUT THE AUTHOR

...view details