కరోనావైరస్ వ్యాపించకుండా 21 రోజుల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మొబైల్ నెట్‌వర్క్‌లపై భారం తగ్గించేందుకు వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
లాక్‌డౌన్ ఉండే 21 రోజలు (ఏప్రిల్ 14 వరకు) తమ ప్లాట్‌ఫామ్‌లపై హై డెఫినేషన్(హెచ్డీ), ఆల్ట్రా హై డెఫినేషన్ కంటెంట్ ట్రాన్స్‌మిషన్ సేవలను నిలిపేస్తున్నట్లు తెలిపాయి.
సోనీ, గూగుల్, ఫేస్‌బుక్, వయాకామ్18, ఎంఎక్స్ ప్లేయర్, హాట్‌స్టార్, జీ5, టిక్‌టాక్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ మేరకు సంయుక్త ప్రకటన చేశాయి.
480పీకి మించొద్దు
సెల్యూలార్ నెట్‌వర్క్‌పై 480పీ కన్నా ఎక్కువ బిట్‌రేట్‌తో సేవలు అందించొద్దని, తక్షణమే ఇది అమలు చేయాలన్న ప్రతిపాదనకు.. అన్ని సంస్థలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తాత్కాలికంగా స్టాండర్డ్ డెఫినేషన్(ఎస్డీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశాయి.