దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ఈ నెల ప్రారంభం నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి టీకా వేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే అందుకు సరిపడా టీకాలు మాత్రం లేకపోవడంపై షా ఆదోళన వ్యక్తం చేశారు.
'టీకాల కొరత విషయంలో చాలా ఆందోళనగా ఉంది. ప్రతి నెల 70 మిలియన్ డోసులు ఎక్కడకు పోతున్నాయో తెలుసుకోవచ్చా? ఈ విషయంలో దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకత అవసరం. టీకాలకు సంబంధించి సరైన సమయ ప్రణాళిక ఉంటే ప్రజలు తమ వంతు వచ్చే వరకు వేచి ఉంటారు.' అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు షా.
ఇదీ చదవండి:ఎన్నికల వల్లే దేశంలో 'కరోనా సునామీ': షా