నిరాశ, ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించటమే ధ్యేయంగా పనిచేసే వెంట్ ఆల్ ఔట్(వీఏఓ) యాప్.. ఇప్పుడు వినియోగదారులపై కాసుల వర్షం కురిపించే 'వెంట్ అండ్ ఎర్న్' ఆఫర్ తీసుకొచ్చేసింది.
ఈ ఉరుకుల పరుగుల జీవితాల్లో మాననసిక ప్రశాంతతను పెంపొందించేందుకు రూపొందించిందే ఈ వీఏఓ యాప్. మనలోని ప్రతికూల శక్తులను పారదోలి సానుకూల దృక్పథాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఈ సామాజిక మాధ్యమం. ఇందులో వినియోగదారులు వారి జీవిత గాథలను పోస్ట్ చేయొచ్చు, ఇతరుల పోస్టుల నుంచి ప్రేరణ పొందొచ్చు. ఇప్పటి వరకు వీఏఓ యాప్‌లో 12 వేల మంది వినియోగదారులు రిజిస్టర్ అయ్యారు. అయితే, లాక్డౌన్ వేళ ఈ యాప్‌కు డిమాండ్ ఒక్కసారిగా 20-23 శాతం పెరిగిపోయింది.
అందుకే, వినియోగదారులకు ఈ లాక్డౌన్ కాలాన్ని లాభదాయకంగా మార్చే ప్రయత్నం చేస్తోంది వీఏఓ. వెంట్ అండ్ ఎర్న్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశ పెట్టింది.
"గత కొద్ది నెలల్లోనే వీఏఓ వేదికపై ప్రజలు గడిపే కాలం గణనీయంగా పెరిగింది. మా వెబ్‌సైట్‌ను ఇష్టపడేవారి సంఖ్య సుమారు 66% పెరిగింది. మా కంటెంట్‌ను చూస్తున్నవారి సంఖ్య 100% పెరిగింది. లాక్డౌన్ వేళ వారి కథలను మాతో పంచుకోవడమే కాదు, ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో మా నిపుణులను అడుగుతున్నారు ప్రజలు. అందుకే, వారిని ఉత్సాహపరచడానికి, మేము వెంట్ అండ్ ఎర్న్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చాం. అంటే డబ్బు సంతోషాన్నిస్తుందని కాదు కానీ, ఏదో గెలిచామన్న సంతృప్తి వారిలో ఆనందాన్ని నింపుతుంది."
-సుమిత్ మిత్తల్, వీఏఓ వ్యవస్థాపకుడు, సీఈఓ
వెంట్ అండ్ ఎర్న్లో ఒక్కో స్టోరీకి 12 రూపాయల వరకు సంపాదించవచ్చు. కనీసం 100 పదాల భావాన్ని వ్యక్తపరిచి, లేదా ఏదైనా స్టోరీలకు 50 పదాల కమెంట్ పెట్టినవారు ఈ వెంట్ అండ్ ఎర్న్కు అర్హులు. అయితే, ఆ కంటెంట్ వీఏఓ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. దేశ వ్యతిరేక లేదా దొంగలించిన కంటెంట్‌ను వీఏఓ అనుమతించదు.
ఇదీ చదవండి:గురకే కదా అని వదిలేస్తే ఇక అంతే!