ఖమ్మం జిల్లా మధిరలో కరోనా టీకాల కోసం సూపర్ స్పైడర్లు పోటెత్తారు. మధిర ప్రాంతం ఆంధ్ర సరిహద్దుగా ఉండటంతో ఇటీవల కరోనా పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ సైతం ఇటీవల మధిరకు వచ్చి సమీక్ష జరిపారు.
వాక్సిన్ కోసం పోటెత్తిన సూపర్ స్పైడర్లు
ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిరలో కరోనా టీకా కోసం సూపర్ స్పైడర్ లు పోటెత్తారు. కరోనా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉండడంతో.. టీకా కోసం ప్రజలు ఎగబడ్డారు.
Vaccination to super spiders in Madhira khammam district
కరోనా పాజిటివ్ రేటు పెరగకుండా దుకాణాలు, ఆటో కార్మికులు వ్యవసాయ కార్మికులకు సూపర్ స్పైడర్లుగా గుర్తించి ముందుగా టీకాలు వేయాలని సూచించారు. ప్రతిరోజు వందలాది మందికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నారు. మధిర ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉందని ప్రచారం జరగటంతో సూపర్ స్పైడర్లు టీకాలు వేసుకునేందుకు పోటీపడుతున్నారు.
ఇదీ చుడండి: భూమిపై మహా కృత్రిమ సూర్యుడు!