తెలంగాణ

telangana

ETV Bharat / business

విద్యార్థి వీసాలకు నిర్దిష్ట గడువు - విద్యార్థి వీసాలకు నిర్దిష్ట గడువు

విదేశీ వీసాలపై నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఏ దేశ వీసాలపై ఈ ఆంక్షలు విధిస్తుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. చైనీయుల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

US: Trump Govt sets a specific deadline on Foreign Visa's
విద్యార్థి వీసాలకు నిర్దిష్ట గడువు

By

Published : Sep 26, 2020, 6:58 AM IST

విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులకు మంజూరుచేసే వీసాలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించాలని ట్రంప్​ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ దేశం పేరును ప్రస్తావించనప్పటికీ, ఈ వీసాల్లోని కొన్ని లొసుగులను అడ్డంపెట్టుకొని చైనా వాసులు అక్రమాలకు పాల్పడుతున్నందున ఈ చర్యలు తీసుకోనుంది.

'ఎఫ్​', 'జె' వీసాలు:

విద్యార్థులకు ఇచ్చే 'ఎఫ్​' వీసాలు, పరిశోధకులకు ఇచ్చే 'జె' వీసాలను నాలుగేళ్లకు పరిమితం చేసింది. ఒకవేళ వారు ఉగ్రవాద దేశాలకు చెందిన వారైతే గరిష్ఠంగా రెండేళ్లకే అనుమతి ఉంటుంది. విదేశీ విద్యార్థులు దేశం విడిచిపెట్టి వెళ్లడానికి ప్రస్తుతం 60 రోజులు గడువు ఉండగా.. దాన్ని 30రోజులకు కుదించింది. విదేశీ పాత్రికేయులకు 'ఐ' వీసాలు మంజూరవుతుంటాయి. ప్రత్యేక పనులకోసం వచ్చే పాత్రికేయులకు తొలుత 240 రోజులకే అనుమతిస్తారు. అవసరమైతే మరో 240రోజులు పొడిగిస్తారు.

ఇదీ చదవండి:టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details