అమెరికా నుంచి విదేశీ పెట్టుబడుల రూపంలో ఈ ఏడాదిలో భారత్‌కు 4 వేల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఇది భారత్‌పై అమెరికా సంస్థలకు ఉన్న అపార విశ్వాసానికి ప్రతీక అని భారత్ కేంద్రంగా పనిచేసే వ్యాపార సలహాల బృందం పేర్కొంది.
కొవిడ్-19 వేళ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా భారత్‌లో పెట్టుబడులు ఈ స్థాయిలో రావడం విదేశీ సంస్థలకు భారత్‌పై ఉన్న భరోసాని తెలియచేస్తున్నాయని అమెరికా- భారత వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు- యూఎస్ఐఎస్పీఎఫ్ స్పష్టం చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. అందులో 20 బిలియన్ డాలర్లు గడచిన కొద్ది వారాల్లోనే వచ్చాయని చెప్పింది.