తెలంగాణ

telangana

ETV Bharat / business

మోదీ పర్యటనపై.. అమెరికా కార్పొరేట్ల భారీ ఆశలు - haudi modi

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారత్​-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అక్కడి కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పాల్గొనడం.. భారత్​కు అగ్రరాజ్యం ఇస్తున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒడుదొడుకుల్లో ఉన్న వాణిజ్య బంధం.. స్థిరపడుతుందని వారు ఆశిస్తున్నారు.

మోదీ పర్యటనపై.. అమెరికా కార్పొరేటర్ల భారీ ఆశలు

By

Published : Sep 22, 2019, 5:19 AM IST

Updated : Oct 1, 2019, 1:00 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై అక్కడి కార్పొరేట్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. భారత్​-అమెరికా ద్వైపాక్షిక బంధాలు బలోపేతమై, వాణిజ్య ఒప్పందాలు వేగవంతమవుతాయని ఆశిస్తున్నాయి. ట్రంప్ విధానాల వల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధం ఒడుదొడుకుల్లో ఉంది.

"మోదీ పర్యటన నేపథ్యంలో భారత్​-అమెరికాల మధ్య వాణిజ్య బంధం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాం."

- నిషా దేశాయ్​ బిస్వాల్​, యూఎస్ ఇండియా బిజినెస్​ కౌన్సిల్ అధ్యక్షురాలు


హౌడీ-మోదీ

నేడు అమెరికాలోని హ్యూస్టన్​లో నిర్వహించే హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రధాని. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ కూడా హాజరుకానున్నారు. సుమారు 50 వేల మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఇరువురు నేతలు ప్రసంగించనున్నారు. ఇది ఇరుదేశాలు ఒకరిపై ఒకరు ఆధారపడిన విషయాన్ని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్​-అమెరికాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి.

యూఎస్​ ఛాంబర్​ ఆఫ్ కామర్స్​

యూఎస్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​లో భాగమైన యూఎస్​ఐబీసీ.. భారత్​లోని అమెరికన్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల కోసం విశేష కృషి చేస్తోంది.

"మూడు రోజుల వ్యవధిలో మోదీ, ట్రంప్ రెండోసారి న్యూయార్క్​లో కలిసే సమయానికి భారత్​-అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాం."- ముఖేష్​ ఆగి, యూఎస్​ఐఎస్​పీఈ

చమురు రాజధానిలో

ప్రపంచంలోని చమురు రాజధానుల్లో హ్యూస్టన్ ఒకటి. సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్​ దాడులు, ఇరాన్​పై అమెరికా ఆంక్షలతో ప్రస్తుతం గల్ఫ్​ తీరంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఫలితంగా భారత్​కు చమురు ఓ పెద్ద సమస్యగా మారింది. అందుకే చమురు కోసం అమెరికా వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇంధన, గ్యాస్​ కంపెనీల సీఈఓలతో రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయనకు హ్యూస్టన్, టెక్సాస్​ల్లో ప్రవాస భారతీయుల ఓట్లు చాలా అవసరం. అందువల్ల ఇరుదేశాల మధ్య చమురు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి.

అంతరిక్షం, జీవశాస్త్ర రంగాల్లోనూ హ్యూస్టన్​ది ప్రముఖ స్థానం. ఇది కూడా భారత్​కు కలిసివచ్చే అంశమే.

వాణిజ్యం.. మరింత ముందుకు

అమెరికాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా టెక్సాస్​ ఉంది. టెక్సాస్​​ కేంద్రంగా పనిచేస్తున్న 28 కంపెనీలు .. భారత్​లో 69 వరకు అనుబంధ సంస్థలను కలిగి ఉన్నాయి. వీటిని మరింత విస్తృతం చేయాలని మోదీ భావిస్తున్నారు. ఫలితంగా ఉపాధి, ఉత్పాదకత, సేవల రంగం అభివృద్ధి చెందుతుందని మోదీ ఆశిస్తున్నారు.

ఇదీ చూడండి:వినియోగదారులకు ఇక బ్యాంకులే ఫైన్​ కడతాయి!

Last Updated : Oct 1, 2019, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details