తెలంగాణ

telangana

ETV Bharat / business

చరిత్రలో తొలిసారి మైనస్​లోకి చమురు ధరలు - us latest news

ప్రపంచవ్యాప్తంగా లాక్​డౌన్ ప్రభావంతో చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా బెంచ్‌మార్క్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ధరలు సున్నా కంటే దిగువకు పడిపోయాయి. కొనుగోలుదారులకు అమ్మకందారులు ఎంతోకొంత చెల్లించి సరుకును వదిలించకుంటున్నారు.

US benchmark WTI oil price closes at -$37.63/barrel
చరిత్రలో తొలిసారి మైనస్​లోకి చమురు ధరల పతనం

By

Published : Apr 21, 2020, 5:47 AM IST

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం చమురు ధరలపై భారీగానే కనిపిస్తోంది. ముడి చమురుకు ఏమాత్రం గిరాకీ లేకపోవడం వల్ల మే నెల కాంట్రాక్టుకు సంబంధించి అమెరికా బెంచ్‌మార్క్‌ వెస్ట్‌టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌లో ధరలు సున్నా కంటే దిగువకు పడిపోయాయి.

కొనుగోలు చేసే వారికి అమ్మకం దారు ఎంతో కొంత నగదు చెల్లించి సరుకును వదిలించుకునే స్థాయిలో బ్యారెల్‌ చమురు ధర మైనస్‌ -37.63 డాలర్లకు పడిపోయింది. ఏప్రిల్‌ కాంట్రాక్టులకు మంగళవారం తుది గడువు కావడం వల్ల మే నెల కాంట్రాక్టులపై కూడా దాని ప్రభావం పడి ధరలు క్షీణించాయి.

ఇదే అదనుగా..

చమురు ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​. 75మిలియన్ బ్యారెళ్లను ప్రభుత్వం నిల్వ చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details