తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత ఆర్థికస్థితి బలహీనంగా ఉంది: ఐఎమ్​ఎఫ్​

భారతదేశంలో నిర్మాణాత్మక, ఆర్థిక రంగ సంస్కరణలు అత్యవసరమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్​ఎఫ్​) పేర్కొంది. అలాగే మధ్యకాలిక ఆర్థిక ఏకీకరణ వ్యూహం కూడా ఆవశ్యకమని తెలిపింది. దేశ రుణభారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ చర్యలు అత్యంత అవసరమని స్పష్టం చేసింది.

Urgent need for more ambitious structural, financial sector reform measures in India: IMF
భారత ఆర్థికస్థితి ఊహించిన దానికంటే బలహీనంగా ఉంది: ఐఎమ్​ఎఫ్​

By

Published : Feb 14, 2020, 11:21 AM IST

Updated : Mar 1, 2020, 7:35 AM IST

రుణ భారం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో నిర్మాణాత్మక, ఆర్థిక రంగ సంస్కరణలు అత్యవసరమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్​ఎఫ్​) పేర్కొంది. అలాగే మధ్యకాలిక ఆర్థిక ఏకీకరణ వ్యూహం కూడా ఆవశ్యకమని తెలిపింది.

బలహీనంగా ఉంది..

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​పై ఐఎమ్​ఎఫ్​ ప్రతినిధి గెర్రీ రైస్​ మాట్లాడుతూ... సంస్థ ఇంతకుముందు అంచనా వేసినదాని కంటే భారత్​లో ఆర్థిక వాతావరణం బలహీనంగా ఉందన్నారు.

బడ్జెట్​లో కీలక రంగాలకు కేటాయింపులు చేసినప్పటికీ, మరింత నిర్మాణాత్మక, ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైస్ అన్నారు. అందుకు తగ్గ కేటాయింపులు, ఉద్దీపనలు, ఆర్థిక వనరులు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఐఎమ్​ఎఫ్​... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి అంచనాలను 4.8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:దశాబ్దపు కనిష్ఠ స్థాయికి చమురు డిమాండ్.. కారణమిదే!

Last Updated : Mar 1, 2020, 7:35 AM IST

ABOUT THE AUTHOR

...view details