యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe UPI charges) చేయనున్నట్లు వస్తున్న వార్తలను పాపులర్ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'ఫోన్‌పే' ఖండించింది. తాము ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని (Phone pe charges) స్పష్టం చేసింది. ఎలాంటి యూపీఐ లావాదేవీ (Phone pe UPI) నిర్వహించినా.. అది పూర్తిగా ఉచితమని పేర్కొంది.
అయితే, ఛార్జీల వసూలుపై కొంతమంది వినియోగదారులపై ప్రయోగం నిర్వహిస్తున్నట్లు ఫోన్‌పే తెలిపింది. రూ.50 నుంచి రూ.100 మధ్య చెల్లింపులు చేస్తే ఒక రూపాయి, రూ.100 కన్నా ఎక్కువ చేసే చెల్లింపులకు రూ.రెండు వసూలు (Phone pe UPI charges) చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రయోగం ప్రకారం రూ. 50 లోపు ఛార్జీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని చెప్పుకొచ్చింది.
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు (Phone pe charges) చేయనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.