గత ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో స్తబ్దుగా ఉన్న గృహ మార్కెట్లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఇది అధికంగా ఉందని తెలిపింది. విక్రయాలతో పాటు నూతన ప్రారంభాలూ 2020 అక్టోబరు-డిసెంబరు నెలల్లో కనిపించాయని పేర్కొంది. దేశంలో ప్రారంభమైన కొత్త ప్రాజెక్టులు ఈ మూడు నగరాల్లో 43శాతం వరకు ఉన్నాయని, అమ్మకాల పరంగానూ 29శాతం వరకు ఇక్కడే కనిపించాయని తెలిపింది.
గృహ మార్కెట్లో పెరుగుతున్న గిరాకీ - కొత్త ప్రాజెక్టులు
గృహ మార్కెట్లో ప్రస్తుతం గిరాకీ పెరుగుతోందని ప్రాప్‌టైగర్ నివేదిక వెల్లడించింది. విక్రయాలతో పాటు నూతన ప్రారంభాలూ 2020 అక్టోబరు-డిసెంబరు నెలల్లో కనిపించాయని పేర్కొంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
![గృహ మార్కెట్లో పెరుగుతున్న గిరాకీ Unsold housing stocks down 9pc in 2020 at 7.18 lakh units; builders may take 4yrs to exhaust](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10203595-766-10203595-1610373583528.jpg)
మిగతా అన్ని నగరాల్లో ధరలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో వృద్ధి కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇక్కడి మౌలిక వసతుల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థల ప్రాజెక్టులే ఇందుకు కారణమని తెలిపింది. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో అత్యధిక ప్రాజెక్టులు హైదరాబాద్‌లోనే ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ కాలంలో హైదరాబాద్‌లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభమవగా.. 6,487 ఇళ్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఆఫీసు కార్యకలాపాల పరంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో సరఫరా, గిరాకీ అధికంగా ఉంది. హైదరాబాద్‌లో ఏడాదిలో 5శాతం వరకు ధరలు పెరిగాయని పేర్కొంది.
ఇదీ చదవండి:పసిడి బాండ్ల జారీ షురూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్