తెలంగాణ

telangana

ETV Bharat / business

సంస్కరణలను కేంద్రం తేలిగ్గా తీసుకుంది: ఫిచ్‌ - ఫిచ్​ రేటింగ్స్

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​లో నూతన నిర్మాణాత్మక సంస్కరణలను తేలికగా తీసుకుందని ఆర్థికసేవల సంస్థ ఫిచ్ తెలిపింది. దేశ వృద్ధిరేటును 5.6 శాతానికి పెంచేందుకు అవసరమైన మార్పులేవీ బడ్జెట్​లో లేవని స్పష్టం చేసింది.

Fitch says Budget light on new structural reforms
కేంద్రం సంస్కరణలను తేలిగ్గా తీసుకుంది: ఫిచ్‌

By

Published : Feb 6, 2020, 11:22 AM IST

Updated : Feb 29, 2020, 9:26 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో నూతన నిర్మాణాత్మక సంస్కరణలను తేలికగా తీసుకుందని ఆర్థిక సేవల సంస్థ 'ఫిచ్‌' అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతంగా ఉన్న వృద్ధి రేటును 5.6 శాతానికి పెంచేందుకు అవసరమైన మార్పులు బడ్జెట్‌లో లేవని పేర్కొంది.

అప్పులు పెరుగుతాయ్​

2025- 26 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రభుత్వ అప్పులు జీడీపీలో 60 శాతం అనే పరిమితి కొనసాగడానికి అవకాశాలు చాలా తక్కువ అని ఫిచ్‌ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అప్పులు 70 శాతానికి దగ్గరగా ఉండవచ్చని తెలిపింది.

నమ్మకం కలగించడం లేదు

కార్పొరేట్‌ ఆదాయపు పన్నులో తగ్గింపు వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచినా, ప్రభుత్వ ఆదాయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది. బ్యాంకింగేతర రుణ సంస్థల ఇబ్బందులు తీర్చేందుకు బడ్జెట్‌లో కొన్ని చర్యలు ప్రకటించినా అవి పాక్షికంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. గృహ రుణాలు అందజేసే సంస్థలకు ప్రభుత్వ చర్యల వల్ల తాత్కాలిక మద్దతు లభించినా, రుణగ్రస్తులకు వాటిపై నమ్మకం కలిగించే అవకాశాలు లేవని తెలిపింది.

ఇదీ చూడండి: అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తాం: చైనా

Last Updated : Feb 29, 2020, 9:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details