Union budget 2022: కేంద్ర బడ్జెట్ మొత్తం అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు. ఇందులో ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు.
- మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలోని 14 రంగాలకు ఉత్పాదకతో ముడిపడిన ఆర్థిక ప్రోత్సాహకాలు. తద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యం
- స్థానిక సంస్థలకు నష్టం కలగకుండా కస్టమ్స్ సంకాల హేతుబద్ధీకరణ
- దేశీయంగానే తగినంత ఉత్పత్తి సాధించడానికి అవకాశమున్న... వ్యవసాయ, రసాయన, వస్త్ర, వైద్య పరికరాలు, ఔషధ పరిశ్రమలకు ఇస్తున్న 350 రకాల పన్ను మినహాయింపులు క్రమంగా తగ్గింపు
- నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక. నిర్మాణ రంగంలో సంస్కరణలు
- కొత్తగా 400 వందేభారత్ రైళ్లు, ఇతర రవాణా సదుపాయాలను రైల్వేలతో అనుసంధానిస్తూ రానున్న మూడేళ్లలో 100 గతిశక్తి లాజిస్టిక్ టర్మినళ్ల ఏర్పాటు
- 25 వేల కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల విస్తరణ
- అన్ని రకాల దీర్ఘకాలిక మూలధన ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను 15 శాతానికి తగ్గింపు. ఇప్పటివరకు అది 37% ఉండేది
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్‌పీఎస్(నేషనల్ పిన్షన్ స్కీం)లో 14% డిడక్షన్ వర్తింపు
- వ్యక్తులు, సంస్థల వద్ద బయటపెట్టని ఆదాయం దొరికినప్పుడు చట్టాల నుంచి ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా పూర్తిగా స్వాధీనం.
Budget allocations
ఈ నాలుగు సూత్రాలే ఆధారం
1.ప్రధాని గతిశక్తి యోజన
2.సమీకృత అభివృద్ధి
3.ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు
4.పరిశ్రమలకు ఆర్థిక ఊతం
ఈ-విద్యకు విశ్వవిద్యాలయం
ప్రధాని ఈ-విద్య కింద ప్రస్తుతం ఉన్న 12 టీవీ ఛానళ్లను 200కు పెంపు. ఉపాధ్యాయుల డిజిటల్ నైపుణ్యాల వృద్ధికి శిక్షణ. విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ-కంటెంట్. దేశంలో ఈ-విద్య విస్తరణకు డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.
రానుంది 5జీ
- దేశవ్యాప్తంగా ప్రైవేటు సంస్థల ద్వారా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత. మారుమూల ప్రాంతాలకు భారత్‌నెట్ ప్రాజెక్టు ద్వారా ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్
- డేటా సెంటర్లు, శక్తి నిలువ వ్యవస్థలకు మౌలిక సదుపాయాల రంగం హోదా