నిరుద్యోగ రేటు రోజురోజుకూ పెరిగిపోతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తాజాగా'ఇప్సోస్' అనే సర్వే పట్టణవాసుల్లో దాదాపు సగం మంది నిరుద్యోగం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. అయితే వీరిలో 69 శాతం మంది.. ప్రస్తుతం దేశం సరైన దిశలోనే పయనిస్తున్నట్లు అభిప్రాయపడ్డారని వెల్లడించింది.
ఇప్సోస్ అనే సర్వే సంస్థ 'వాట్ వర్రీస్ ది వరల్డ్' పేరిట 28 దేశాల్లో ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ ప్యానెల్ వ్యవస్థ ద్వారా నెలవారీగా ఈ సర్వే నిర్వహించింది.ఈ సర్వే నిరుద్యోగంతోపాటు ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానతలు, వాతావరణ మార్పులు భారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంది.
భారత్ ఆశావాదం
సర్వే ప్రకారం, ప్రపంచ పౌరుల్లో 61 శాతం మంది తమ దేశం తప్పుడు మార్గంలో పోతోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రపంచ ధోరణికి భిన్నంగా 69 శాతం మంది పట్టణ భారతీయులు ఇండియా సరైన దిశలో పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.