తెలంగాణ

telangana

ETV Bharat / business

డిజిటల్​​​కు అవరోధాలు - online payment system

డిజిటల్ లావాదేవీలకు అనధీకృత సర్ ఛార్జీలు, అధిక ఎండీఆర్​ (మర్చండైజ్​ డిస్కౌంట్​ రేట్​) అవరోధాలుగా మారుతున్నాయని ఐఐటీ బాంబే అధ్యయనం వెల్లడించింది.

డిజిటల్​​​కు అవరోధాలు

By

Published : Mar 4, 2019, 12:06 AM IST

Updated : Mar 4, 2019, 12:28 AM IST

డిజిటల్​ లావాదేవీలు అనుకున్నంతగా వృద్ధి సాధించకపోవడానికి కారణాలను ముంబయి ఐఐటీ చేసిన ఓ అధ్యయనం బయటపెట్టింది. దీని ప్రకారం డిజిటల్​ లావాదేవీలకు ప్రభుత్వాలు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. కానీ అనుకున్నంత మేరకు డిజిటల్ లావాదేవీలు పెరగటం లేదు. దీనికి కారణం అనధీకృత సర్ ఛార్జీలు, అధిక ఎండీఆర్​ (మర్చండైజ్​ డిస్కౌంట్​ రేట్​) లని పేర్కొంది నివేదిక.

ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడంలో చిరు, మధ్యతరహా వ్యాపారులు, వినియోగదారులు విఫలమవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది.
గత ఏడాది క్రెడిట్​ కార్డు ఎండీఅర్​ కారణంగా రూ. 10,000 కోట్ల భారం వ్యాపారులపై పడిందని స్పష్టం చేసిందీ నివేదిక. డెబిట్​ కార్డు ద్వారా రూ. 3,500 కోట్ల భారం పడినప్పటికీ 2018లో క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా 5.7 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అంచనా వేసింది.

'సర్​ఛార్జ్ ద్వారా సర్​ఛార్జ్​ లేకుండా' అనే పేరుతో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఆశిష్ దాస్ ఈ నివేదిక తయారు చేశారు. ఆన్​లైన్ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకులు చెల్లింపుల సమయంలో అనధీకృత సర్​ఛార్జీల్ని విధిస్తున్నాయి. ఇది బిమ్​ యూపీఐ, కార్డు హోల్డర్లకు శరాఘాతంగా మారిందని పేర్కొందీ నివేదిక.

Last Updated : Mar 4, 2019, 12:28 AM IST

ABOUT THE AUTHOR

...view details