'2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం' కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ 'ఇన్వెస్ట్ ఇండియా'ను వరించటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
"2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడుల ప్రోత్సాహక పురస్కారం' గెలుచుకున్న'ఇన్వెస్ట్ ఇండియా' ఏజెన్సీకి శుభాకాంక్షలు. పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే అనువైన కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు, సులభతర వాణిజ్యాన్ని నెలకొల్పేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందనటానికి ఈ అవార్డు నిదర్శనం."