ULIP Policy: బీమా రక్షణ, మార్కెట్లో పెట్టుబడికి అవకాశం, పన్ను ఆదా ఈ మూడూ ఒకే చోట కావాలనుకున్నప్పుడు ఉన్న మార్గం యూనిట్ ఆధారిత బీమా పాలసీ (యులిప్)లు. పన్ను ఆదాకు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లాంటి పథకాలున్నప్పటికీ.. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించే యులిప్‌లు చాలామంది ఎంచుకుంటారు.
పన్ను మినహాయింపు:
best ULIP Plans: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం యులిప్‌లకు చెల్లించిన ప్రీమియానికి పరిమితి మేరకు మినహాయింపు వర్తిస్తుంది. దీంతోపాటు పెన్షన్ ప్లాన్లను ఎంచుకున్నప్పుడు సెక్షన్ 80సీసీసీ కింద క్లెయిం చేసుకోవచ్చు. ఈ రెండు సెక్షన్లకు కలిపి పరిమితి రూ.1,50,000 ఉంటుంది. పాలసీకి చెల్లించే వార్షిక ప్రీమియం పాలసీ విలువలో 10శాతానికి మించి ఉండకూడదు.
పాక్షికంగా వెనక్కి:
Best ULIP Plans in India 2021: యులిప్‌లకు లాకిన్ వ్యవధి అయిదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత వీటిలో నుంచి పాలసీదారుడు పాక్షికంగా కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఇది మొత్తం ఫండ్ విలువలో 20 శాతానికి మించి ఉండకూడదు. ఉదాహరణకు అయిదేళ్ల తర్వాత ఫండ్ విలువ రూ.2లక్షలు ఉంటే.. ఇందులో నుంచి రూ.40వేల వరకూ తీసుకోవచ్చన్నమాట. బీమా సంస్థలు దీనిపై పరిమితి విధించేందుకూ అవకాశం ఉంది. పాలసీ తీసుకునేముందు ఈ నిబంధన గురించి తెలుసుకోవడం మంచిది.
వ్యవధి తీరాక: