తెలంగాణ

telangana

ETV Bharat / business

నీరవ్​కు బెయిల్​ నిరాకరణ- మరో నెల రిమాండ్

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్​ పిటిషన్​ను లండన్​ కోర్టు మరోమారు తిరస్కరించింది. వచ్చే నెల 24 వరకు రిమాండ్​ పొడిగించింది. తదుపరి విచారణను మే 30న జరపనుంది.

నీరవ్​ మోదీ

By

Published : Apr 26, 2019, 3:52 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు (పీఎన్​బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్​ కోర్టులో మూడో సారి చుక్కెదురైంది.

ఆయన బెయిల్ అభ్యర్థనను తోసిపోచ్చుతూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. నీరవ్​కు వచ్చేనెల 24 వరకు రిమాండ్ పొడిగించింది. పూర్తి విచారణను మే 30 జరపనున్నట్లు తెలిపింది.

దాదాపు రూ. 13,000 కోట్ల కుంభకోణం కేసులో నీరవ్​ ప్రధాన నిందితుడు. మోసం వెలుగులోకి వచ్చేసరికి ఆయన లండన్​ పరారయ్యారు.

నీరవ్​ మోదీని అప్పగించాలని భారత్​​ చేసిన విజ్ఞప్తి మేరకు లండన్​ కోర్టు ఆయనపై ఆరెస్టు వారెంటు జారీ చేసింది.

మార్చి 19న స్కాట్​లాండ్ యార్డ్​​ అధికారులు నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు. నీరవ్​ను స్వదేశానికి రప్పించేందుకు భారత్​ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details