తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 6:34 PM IST

ETV Bharat / business

ట్విట్టర్​లో మరో ఫీచర్​- డబ్బులిస్తే అడల్ట్ కంటెంట్!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ త్వరలోనే 'సూపర్ ఫాలోస్ ఫీచర్‌'ను ప్రారంభించనుంది. పదివేల మంది ఫాలోవర్స్ ఉన్న యూజర్లకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టనున్న ఈ ఫీచర్​ గురించి మరింత తెలుసుకోండి.

Twitter to launch Super Follows tool for users with 10K followers
ట్విట్టర్

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ త్వరలోనే 'సూపర్ ఫాలోస్ టూల్' అనే సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయబోతోంది. కనీసం 10,000 మంది ఫాలోవర్స్ ఉన్న యూజర్లు.. వారు చేసే ట్వీట్లు, అందించే ప్రత్యేక కంటెంట్‌ కోసం ఫాలోవర్స్​ నుంచి కొంత నగదు ఛార్జ్ చేసే వీలును ఈ ఫీచర్ కల్పిస్తుంది.

ఏఏ కేటగిరీల్లో..?

నూతన ఆదాయ మార్గాల అన్వేషణను లక్ష్యంగా పెట్టుకున్న ట్విట్టర్.. ఓ వర్చువల్ ఈవెంట్‌లో ఈ ఫీచర్​కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. దీనిని పొందేందుకు వినియోగదారుల నుంచి 4.99 డాలర్లు(నెలకు) వసూలు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. 'సూపర్ ఫాలోస్' వినియోగదారులు అందించే కంటెంట్‌కు సంబంధించి కొన్ని కేటగిరీలను ట్విట్టర్ ప్రదర్శించింది. వీటిలో 'అడల్ట్ కంటెంట్', 'ఓన్లీఫ్యాన్స్' విభాగాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

ట్విట్టర్ 'సూపర్ ఫాలోస్' ఫీచర్‌ వివరాలు..

ట్విట్టర్ బ్లూ 'పెయిడ్'..

ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడాల్లో 'ట్విట్టర్ బ్లూ' పెయిడ్ సేవలను గతవారం సంస్థ ప్రారంభించింది. దీనిద్వారా పోస్ట్ చేసిన 30 సెకండ్లలో తమ ట్వీట్​లో అక్షరదోషాన్ని గుర్తిస్తే సరిదిద్దుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించింది. ఈ సర్వీస్​ భారత్ సహా ఇతర దేశాల్లో క్రమంగా అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

2023 నాటికి వార్షిక ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ట్విట్టర్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవీ చదవండి:ఆ దేశంలో ట్విట్టర్​పై సస్పెన్షన్ వేటు

ట్విట్టర్​ కొత్త ఫీచర్​.. ఇకపై ట్వీట్లు మాయం!

'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'

ABOUT THE AUTHOR

...view details