మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.. కొత్త ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆంగ్లంలో ట్విట్టర్ వినియోగిస్తున్న లాభాపేక్షలేని, పాత్రికేయులతో పాటు ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్న మరికొందరి కోసం 'టిప్ జార్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు సులభంగా నగదు పంపించేలా ఈ ఫీచర్ను రూపొందిస్తోంది. దీని ద్వారా తన అభిమాన ఖాతాదారులకు డబ్బులు పంపొచ్చు. దీనిని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో తీసుకొచ్చేందుకు ట్విట్టర్ కసరత్తు చేస్తోంది.
ఈ టిప్ జార్ ఇప్పటికే బ్యాండ్క్యాంప్, క్యాష్ యాప్, పేపాల్, వెన్మో, పట్రెయాన్ వంటి నగదు బదిలీల్లో పని చేస్తోంది.
"ఇక నుంచి ఎన్నో గొంతుకలకు మీరు మద్దతుగా నిలవొచ్చు. టిప్ జార్తో వారికి నగదు పంపొచ్చు. ట్విట్టర్ ప్రొఫైల్లోని టిప్జార్ ఐకాన్ నొక్కి.. ఐఓఎస్, ఆండ్రాయిడ్లలో పరీక్షించిన తర్వాత నగదు బదిలీ చేయవచ్చు."