తెలంగాణ

telangana

ETV Bharat / business

ఖాతాల వేటుపై కేంద్రంతో ట్విట్టర్ చర్చలు - Twitter seeks dialogue with IT Min

1,178 ట్విట్టర్ ఖాతాలపై వేటు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రితో అధికారిక చర్చలు జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. రైతు నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఈ ఖాతాలపై నిషేధం విధించాలని కేంద్రం కోరింది.

Twitter seeks dialogue with IT Min after order to block a/cs, says safety of staff top priority
ఖాతాల వేటుపై కేంద్రంతో ట్విట్టర్ చర్చలు

By

Published : Feb 9, 2021, 1:50 PM IST

రైతుల నిరసనలపై దుష్ప్రచారం చేస్తున్న 1,178 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్​ను సంప్రదిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అధికారికంగా ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది.

"భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. అధికారిక చర్చల కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రిని సంప్రదించాం."

-ట్విట్టర్ ప్రతినిధి

ఆదేశాలను పాటించనందుకు ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన నోటీసుపైనా చర్చిస్తున్నట్లు పేర్కొంది ట్విట్టర్. ఉద్యోగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది.

కేంద్రం నోటీసులు

పాకిస్థాన్, ఖలిస్థాన్ మద్దతుదారులకు అనుకూలంగా ఉన్న 1,178 ఖాతాలను నిలిపివేయాలని ఫిబ్రవరి 4న ట్విట్టర్​ను కేంద్రం ఆదేశించింది. అంతకుముందు రైతు నిరసనల్లో హింసకు సంబంధం ఉన్న ఖాతాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details