దేశం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. మహమ్మారిపై పోరులో మద్దతుగా నిలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న 'ఎస్ఓఎస్'(అత్యవసర) సేవలను అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది.
ఏంటీ ఎస్ఓఎస్!
అత్యవసర సేవలను కోరేవారితో పాటు.. సహాయం అందించే వారి తాజా ట్వీట్లను 'ఎస్ఓఎస్' పేజీలో అందుబాటులో ఉంచుతుంది ట్విట్టర్. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు ఇదివరకే నిర్దిష్ట పేజీలు ఉండగా.. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక పేజీని తీసుకురానున్నట్లు తెలిపింది.