ఆండ్రాయిడ్ యూజర్లకు ట్విట్టర్ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకుముందు ఆడియో చాట్ కోసం ఐవోఎస్ యూజర్లకు అందించిన ‘స్పేసెస్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకూ అందించనుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఎక్కువగా వినియోగించే భారత్ లాంటి దేశాల్లో యూజర్ల కోసం ఆడియో చాట్ ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని పేర్కొంది. ‘‘ఆండ్రాయిడ్ యూజర్లూ..! స్పేసెస్ ఫీచర్‌కు సంబంధించి బీటా వెర్షన్‌ను ప్రారంభించాం. త్వరలో స్పేస్‌లో జాయిన్ అయ్యి మాట్లాడుకోండి. మీరు సొంతంగా క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉండండి.. కొన్ని అంశాలపై టెస్టింగ్ చేస్తున్నాం. లైవ్ స్పేస్ కోసం వేచి చూస్తూ ఉండండి. త్వరలోనే కలుద్దాం..’’ అని ట్వీట్ చేసింది.
ఎలా చేయాలంటే..?