తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్​ కొత్త రూల్​- ఇతరుల ఫొటోలు షేర్​ చేస్తే ఇక అంతే! - twitter information policy

Twitter new rules: అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు, వీడియోలను ఎవరైనా పోస్ట్ చేస్తే ఇకపై చర్యలు చేపట్టనుంది ట్విట్టర్​. సంబంధిత వ్యక్తుల అభ్యర్థన మేరకు వాటిని తమ సామాజిక మాధ్యమ వేదిక నుంచి తొలగించనుంది. ఈ కొత్త నిబంధనలు నవంబరు 30 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పింది.

Twitter New Rule
ట్విట్టర్​ కొత్త రూల్

By

Published : Dec 1, 2021, 10:37 AM IST

Updated : Dec 1, 2021, 11:10 AM IST

Twitter new rules: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్​.. కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అనుమతి లేకుండా ఒకరి ఫొటోలు, వీడియోలను ఇతరులు పోస్ట్ చేస్తే.. సంబంధిత వ్యక్తుల అభ్యర్థన మేరకు వాటిని తొలగించనున్నట్లు తెలిపింది. ​

వ్యక్తిగత చిరునామా, ఫోన్ నంబర్ వంటి విషయాలకు ఇది వరకే వర్తిస్తున్న ఈ నిబంధనను ఇకపై ఫొటోలు, వీడియోలు వంటి విషయంలో కూడా వర్తిస్తుందని ట్విట్టర్ తెలిపింది. ఈ మేరకు ప్రైవేట్ ఇన్​ఫర్మేషన్​ పాలసీని సవరించింది. "ఏదైనా ట్వీట్​కు సంబంధించి అనధికారిక ప్రైవేట్ మీడియా ఉందని.. రిపోర్ట్ వస్తే మేం ఇకపై చర్యలు చేపడతాం" అని ట్విట్టర్ తన నిబంధనల్లో​ తెలిపింది. నవంబరు 30 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు చెప్పింది.

పరిగణించి..

Twitter new rule on photos: ఏ పరిస్థితుల్లో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారన్న విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని ట్విట్టర్​ తెలిపింది. ఈ కొత్త నిబంధన నుంచి కొన్నింటికి మినహాయింపునిస్తున్నట్లు చెప్పింది. ప్రముఖుల​ వంటి వారి విషయంలో, ప్రజా ప్రయోజనం ఉన్న విషయంలో ఫొటోలను, వీడియోలను ఎవరైనా షేర్ చేస్తే ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.

విమర్శలు..

ట్విట్టర్ తీసుకువచ్చిన ఈ కొత్త నియమంపై ఉన్న ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురవుతున్నాయి. పేపర్లో ఉన్న ఈ నిబంధనలను ఆచరణాత్మకంగా అమలు చేయడం కష్టతరమని చెబుతున్నారు.

ఇదీ చూడండి:5జీపై టెల్కోల పెట్టుబడులు రూ.1.8 లక్షల కోట్లు!

Last Updated : Dec 1, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details