తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీనామా - twitter news

వ్యక్తిగత కారణాలతో ట్విట్టర్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ రాజీనామా చేశారు. బాధ్యతల అప్పగింత సులువుగా సాగేందుకు మార్చి చివరి వరకు అదే పదవిలో కొనసాగనున్నారు.

twitter indias public policy head steps down
ట్విటర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ రాజీనామా

By

Published : Feb 7, 2021, 10:44 PM IST

ట్విట్టర్‌ ఇండియా పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ మహిమా కౌల్‌ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలు చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ధ్రువీకరించింది. అయితే, బాధ్యతల అప్పగింత సులువుగా సాగేందుకు మార్చి చివరి వరకు ఆమె అదే పదవిలో కొనసాగుతారని పేర్కొంది. 2015లో మహిమా ట్విట్టర్‌లో చేరారు. ఐదేళ్ల పాటు సేవలందించారు.

రైతు ఉద్యమం నేపథ్యంలో ట్విట్టర్‌.. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన వేళ ఆమె బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించకుంది. రైతుల ఆందోళనపై తప్పుడు సమాచారం చేరవేసిన ఖాతాలను పునరుద్ధరించిన నేపథ్యంలో కేంద్రంట్విట్టర్‌ను ఇటీవల హెచ్చరించింది. భారత చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఇటీవలి పరిణామాలు ఆమె రాజీనామాకు కారణం కాదని ట్విట్టర్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:పీఎస్​యూల ప్రైవేటీకరణపై నిర్మల కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details