తెలంగాణ

telangana

ETV Bharat / business

New IT Rules: ట్విట్టర్​కు హైకోర్టు షాక్! - twitter new rules

నూతన ఐటీ నిబంధనలు ట్విట్టర్ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నియమాలను ట్విట్టర్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆ సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Twitter has to comply with new IT rules for digital media, says HC
'ఐటీ రూల్స్​ను ట్విట్టర్ పాటించాల్సిందే'

By

Published : May 31, 2021, 1:10 PM IST

Updated : May 31, 2021, 1:36 PM IST

డిజిటల్ మీడియా కోసం కేంద్రం రూపొందించిన నియమాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని దిల్లీ హైకోర్టు(Delhi High Court) స్పష్టం చేసింది. ట్విట్టర్(Twitter) సంస్థ నిబంధనలు పాటించడం లేదని అమిత్ ఆచార్య అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు.. ఈ అంశంపై వైఖరి తెలపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ట్విట్టర్​కు నోటీసులు జారీ చేసింది.

భిన్నవాదనలు

కాగా, నూతన ఐటీ నిబంధనల(new IT rules)ను పాటిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. స్థానిక ఫిర్యాదు పరిష్కార అధికారిని సైతం నియమించినట్లు న్యాయస్థానానికి వెల్లడించింది.

అయితే ఈ ప్రకటనను కేంద్రం తప్పుబట్టింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్​ నడుచుకోవడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది రిపుదమన్ సింగ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ట్వీట్లకు సంబంధించి ఫిర్యాదులు పరిష్కరించేందుకు అధికారిని ఇంతవరకు నియమించలేదని అన్నారు.

రెండు ట్వీట్లకు సంబంధించి ఆ సంస్థకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినట్లు పిటిషనర్ ఆచార్య పేర్కొన్నారు. అప్పుడే ఈ నిబంధనలు పాటించడం లేదన్న విషయం బయటపడిందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు పరిష్కార అధికారిని వెంటనే నియమించేలా ట్విట్టర్​కు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇవీ చదవండి-

New IT rules: కొత్త నిబంధనలతో గూగుల్​, ఫేస్​బుక్​ అప్​డేట్​!

Twitter: 'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'

Last Updated : May 31, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details