తెలంగాణ

telangana

ETV Bharat / business

తప్పు జరిగింది.. క్షమించండి: ట్విట్టర్ - ట్విట్టర్​ లేటెస్ట్ న్యూస్

ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాల హ్యాకింగ్ ఘటనతో తాము ఇబ్బంది పడ్డామని ట్విట్టర్ తెలిపింది. ఈ ఘటన తీవ్ర నిరాశకు గురిచేసిందని, యూజర్లు క్షమించాలని కోరింది. హ్యాకింగ్​కు గురైన 130 ఖాతాల్లో 45 ఖాతాల పాస్​వర్డ్​లు హ్యాకర్లు రీసెట్ చేయగలిగారని వెల్లడించింది.

twitter says sorry
ట్విట్టర్ క్షమాపనలు

By

Published : Jul 20, 2020, 12:49 PM IST

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న 130 మంది ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాల హ్యాకింగ్ ఘటనపై ట్విట్టర్​ విచారం వ్యక్తం చేసింది. హ్యాకింగ్​కు గురైన 130 ఖాతాల్లో 45 ఖాతాల పాస్​వర్డ్​లు హ్యాకర్లు రీసెట్ చేయగలిగారని తెలిపింది.

'యువర్ ట్విట్టర్​ డేటా' టూల్​ ద్వారా 8 ఖాతాల సమాచారం హ్యాకర్లు డౌన్​లోడ్ చేసుకున్నట్లు తెలిపింది ట్విట్టర్​. అయితే ఆ ఖాతాలేవీ కుడా గుర్తింపు పొందినవి కాదని స్పష్టం చేసింది. ఈ విషయంపై ఖాతాదారులను సంప్రదించినట్లు వివరించింది.

"ఈ ఘటనతో మేం ఇబ్బంది పడ్డాము. నిరుత్సాహానికి గురయ్యాము. అన్నింటికంటే ముఖ్యంగా మీరు మమ్మల్ని క్షమించాలి. మళ్లీ మీ నమ్మకాన్ని తిరిగిపొందాలంటే మేం చాలా కష్టపడాలని మాకు తెలుసు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని విధాల సహకరిస్తాం."

-ట్విట్టర్

ఓజీ కమ్యూనిటీ పనే!

ఇటీవల జరిగిన ట్విట్టర్​ ఖాతాల హ్యాకింగ్ వెనుకున్న ఓజీ కమ్యూనిటీ హస్తం ఉన్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ 221బీ ప్రధాన పరిశోధకులు అల్లిసర్​ నిక్సన్​ అన్నారు. గతంలో వీరి వల్ల జరిగిన హ్యాకింగ్​లకు ఇప్పుడు జరిగిన వాటికి పోలికలు ఉన్నట్లు తెలిపారు. అయితే ఓజీ కమ్యూనిటీ అనేది ఏ దేశం కేంద్రంగా పని చేస్తుందన్న విషయంపై స్పష్టత లేదన్నారు నిక్సన్.

ABOUT THE AUTHOR

...view details