తెలంగాణ

telangana

By

Published : Mar 23, 2021, 6:58 AM IST

ETV Bharat / business

ట్విట్టర్​ సీఈఓ తొలి ట్వీట్​ వేలం

ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సే తొలి ట్వీట్​ను వేలంలో రూ.20.9 కోట్లకు బ్రిడ్జ్​ ఓరాకిల్​ సంస్థ సీఈఓ సీనా ఎస్తావి కొనుగోలు చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో వచ్చిన ఆ డబ్బుని 'గివ్​ డెరెక్ట్​లీ' అనే సేవా సంస్థకు విరాళంగా ఇస్తున్నట్టు జాక్​ వెల్లడించారు.

ceo
ట్విట్టర్​ సీఈఓ తొలి ట్వీట్​ వేలం

ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సే తొలి ట్వీట్​ సోమవారం నిర్వహించిన వేలంలో రూ.20.9 కోట్లకు అమ్ముడుపోయింది. నాన్​ ఫంజిబుల్​ టోకెన్​ కింద వేలం వేసిన ఈ ట్వీట్​ను బ్రిడ్జ్​ ఓరాకిల్​ సంస్థ సీఈఓ సీనా ఎస్తావి కొనుగోలు చేశారు. క్రిప్టో కరెన్సీ రూపంలో వచ్చిన ఆ డబ్బుని 'గివ్​ డెరెక్ట్​లీ' అనే సేవా సంస్థకు విరాళంగా ఇస్తున్నట్టు జాక్​ వెల్లడించారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన ఆఫ్రికా దేశాలకు ఈ విరాళాన్ని అందించనున్నట్టు పేర్కొన్నారు. 'జస్ట్​ సెట్టింగ్​ అప్​ మై ట్విట్టర్​' అని ఉండే ఈ ట్వీట్​ను మార్చి 2006లో జాక్ ట్వీట్​ చేశారు.

ఇది కేవలం ట్వీట్ కాదు..

జాక్​ తొలి ట్వీట్​ కొనుగోలుపై సీనా ఎస్తావి స్పందించారు. ఇది కేవలం ట్వీట్​ కాదని, భవిష్యత్తులో దీని విలువ ప్రజలకు అర్థం అవుతుందన్నారు. ట్వీట్​ కొనుగోలుదారుకు జాక్​ ట్వీట్​ వివరాలతో ఉన్న ధ్రువపత్రాన్ని అందించనున్నారు.

ఇదీ చదవండి :అమెజాన్​తో వివాదంలో 'ఫ్యూచర్'​కు ఊరట

ABOUT THE AUTHOR

...view details