తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2021, 5:32 AM IST

ETV Bharat / business

దిగొచ్చిన ట్విట్టర్​.. ఆ పోస్టుకు భారత అధికారి నియామకం

నూతన ఐటీ నియమాలకు అనుగుణంగా ఎట్టకేలకు చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్‌ను నియమించింది ట్విట్టర్​. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు త్వరలోనే సమాచారం అందించనున్నట్లు పేర్కొంది.

TWITTER
ట్విట్టర్​

ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. ఈ వివరాలన్నీ ఐటీ మంత్రిత్వ శాఖకు త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది.

తాజా ఐటీ నిబంధనల ప్రకారం.. వినియోగదారుల సంఖ్య 50లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్​లో నివసిస్తూ ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details