భారత్లో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది టెలివిజన్ వ్యూయర్షిప్(వీక్షణలు) భారీగా పెరిగిందని బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) తెలిపింది. వారంలో టెలివిజన్ చూసే సమయం 9 శాతం పెరిగి 999 బిలియన్ల నిమిషాలకు చేరిందని వెల్లడించింది.
2019లో ఒకరోజులో ప్రతి వ్యక్తి సగటు వీక్షణ సమయం 3 గంటల 42 నిమిషాలు ఉండగా.. 2020లో అది 4 గంటల 2 నిమిషాలకు పెరిగిందని బార్క్ తెలిపింది. లాక్డౌన్తో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడం వల్ల టీవీ వీక్షణ సమయం గణనీయంగా పెరిగిందని చెప్పింది.
ఏవేవి? ఎంతెంత?
- సాధారణ వినోద ఛానెళ్లను చూసే నిమిషాలు 9 శాతం పెరిగాయి. సినిమాలు- 10 శాతం, పిల్లల ఛానెళ్లు- 27 శాతం పెరిగాయి.
- మ్యూజిక్ ఛానెళ్లు చూసే నిమిషాలు(- 11 శాతం), క్రీడ ఛానెళ్లు(-35 శాతం) తగ్గాయి.