త్వరలో డీటీహెచ్ సహా కేబుల్ టీవీ వినియోగదార్లు సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీ) మార్చకుండానే నెట్వర్క్ మార్చుకునే విధానం రానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రకటించింది.
బాక్స్ మార్చకుండానే టీవీ నెట్వర్క్ మార్చొచ్చు! - కేబుల్ టీవీ
సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే డీటీహెచ్, కేబుల్ టీవీ నెట్ వర్క్ మార్చుకునే సదుపాయం త్వరలోనే రానుంది. టీవీ వీక్షకులకు ఈ ఏడాది చివరికల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్రాయ్ ప్రకటించింది.
ట్రాయ్
"సెట్ టాప్ బాక్స్‌లలో ఇంటర్ఆపరబుల్(అంతర్గతంగా మార్చుకునే) విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గత రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాం. ఇందుకు సంబంధించిన సమస్యలను చాలా వరకు పరిష్కరించాం. కొన్ని వ్యాపారపరమైన సమస్యలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాం "- ఆర్.ఎస్.శర్మ, టెలికాం నియంత్రణ సంస్థ ఛైర్మన్.