కేంద్ర ఆర్థిక శాఖ ఖర్చుల విభాగం కార్యదర్శిగా ఉన్న టీవీ సోమనాథన్.. ఆర్థిక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టీవీ సోమనాథన్.. తమిళనాడుకు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అన్ని కార్యదర్శుల్లో అత్యంత సీనియర్ అయిన సోమనాథన్ను.. ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది.