రైల్వే టికెట్స్ బుకింగ్, ప్రయాణ వివరాలు, తదితర అంశాల్లో ప్రయాణికులకు మరింత భరోసా, పారదర్శకతతో కూడిన సమాచారం అందించేందుకు భారతీయ రైల్వే(Indian Railways News) మరో అడుగు ముందుకు వేసింది. ట్రూ కాలర్ యాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139ను ఇకపై ట్రూ కాలర్ వెరిఫై చేయనుంది. 139 హెల్ప్‌లైన్‌కు కాల్, మెసేజెస్ చేసినప్పుడు వాటికి వెరిఫైడ్ అనే గ్రీన్ బ్యాడ్జ్ వస్తుంది. ఫలితంగా.. తమకు ఐఆర్సీటీసీ నుంచే సమాచారం అందుతోందన్న నమ్మకం ప్రయాణికులకు కలుగుతుంది.
" ట్రూ కాలర్‌తో జతకట్టినందుకు మేం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రయాణికులకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కచ్చితమైన, పారదర్శకతతో కూడిన సమాచారాన్ని అందించేందుకు మేము ట్రూ కాలర్‌తో భాగస్వామ్యం అయ్యాం. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139ను ఇకపై ట్రూ కాలర్ వెరిఫికేషన్ చేయనుంది."
-- రజనీ హసీజా, ఐఆర్సీటీసీ ఛైర్మన్ అండ్ ఎండీ