తెలంగాణ

telangana

ETV Bharat / business

టీవీ వీక్షకులకు శుభవార్త.. తగ్గనున్న ఎన్‌సీఎఫ్ ఛార్జీలు - Troy reduced NCF charges

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా బ్రాడ్ కాస్ట్ నిబంధనలు సవరించింది. టీవీ వీక్షకులకు ఉపశమనం కలిగిస్తూ బోకే, నెట్​వర్క్ కెపాసిటీ ఫీజు తగ్గించింది. ఇవి 2020 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Troy reduces NCF charges
ఎన్‌సీఎఫ్ ఛార్జీలు తగ్గించిన ట్రాయ్

By

Published : Jan 1, 2020, 8:16 PM IST

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఎట్టకేలకు టీవీ వీక్షకులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంది. గత ఏడాది నుంచి అమలు అవుతున్న బ్రాడ్‌ కాస్ట్‌ నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం బోకే, నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు(ఎన్​సీఎఫ్​) తగ్గించింది.

తగ్గనున్న బిల్లులు

సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ.150 ఎన్​సీఎఫ్ ఛార్జీ ఇక నుంచి రూ.130 కానుంది. ఈ మొత్తంతో వినియోగదారుడు ఉచితంగా చూసే వీలున్న 100 ఛానెల్స్‌ను 200కు పెంచింది. అలాగే మల్టీ టీవీ ఛానెల్స్‌ వీక్షించే వినియోగదారులకు సైతం ఛానెల్స్‌ రేటు తగ్గించింది.

మార్చి నుంచి అమల్లోకి..

ఈ సవరించిన కొత్త నిబంధనలను 2020 జనవరి 15 లోగా ప్రసారకర్తలు , 2020 జనవరి 30 లోగా డీటీహెచ్​, కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు తెలియజేయాలని స్పష్టం చేసింది ట్రాయ్​. కొత్త మార్పులు 2020 మార్చి 1 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

ఇదీ చూడండి:నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్​!

ABOUT THE AUTHOR

...view details