భారత్‌లో ఈ ఏడాది ఇంటర్నెట్ డేటాను భారీఎత్తున వినియోగించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తెలిపింది. సెప్టెంబర్ వరకు విడుదలైన సమాచారం ప్రకారం 54,917 మిలియన్ల జీబీ డేటాను వినియోగించినట్లు తెలుస్తోంది.
2014లో 828 మిలియన్ల జీబీ డేటా మాత్రమే వినియోగించగా.. 2018 నాటికి ఇది 46,404 మిలియన్ల జీబీకి చేరింది. 2019లో ఇప్పటివరకు వచ్చిన లెక్కలను చూస్తేనే గత ఏడాది డేటాను ఎప్పుడో దాటేసింది.
వైర్‌లెస్ డేటా వినియోగులు ఇలా..
వైర్‌లెస్ ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య 2014లో 281.58 మిలియన్లు ఉండగా.. 2019 సెప్టెంబర్ నాటికి 664.80 మిలియన్లకు చేరింది. 2017కు 2018కి వీరి సంఖ్య దాదాపు 36.36శాతం పెరిగింది. 2017లో డేటా వినియోగం కంటే 2018లో డేటా వినియోగం రెట్టింపు కావడం విశేషం. 2016కు డేటా వినియోగం 4642గా మాత్రమే ఉందని ట్రాయ్ నివేదికలో పేర్కొంది.