తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్​న్యూస్​: 100 దాటినా ఎస్​ఎంఎస్​లు ఉచితమే!

ఎస్​ఎంఎస్​లపై ఛార్జీలు తొలగించాలని ట్రాయ్​ ప్రతిపాదనలు చేసింది. 100 సందేశాలకు మించి పంపితే ప్రస్తుతం వసూలు చేస్తున్న 50పైసలను ఉపసంహరించాలని నిర్ణయించింది.

trai
ట్రాయ్​

By

Published : Feb 19, 2020, 1:07 PM IST

Updated : Mar 1, 2020, 8:11 PM IST

ఎస్​ఎంఎస్​పై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ-ట్రాయ్ నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు 100 సందేశాలకు మించి పంపిన ప్రతి ఎస్​ఎంఎస్​పై 50పైసలను వసూలు చేస్తోంది. అభ్యంతరకర సందేశాలకు అడ్డుకట్ట వేసేందుకు ఛార్జీల విధానాన్ని 2012 నవంబర్​లో ప్రవేశపెట్టింది ట్రాయ్​.

"టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్​ కస్టమర్ ప్రిఫరెన్స్​ రెగ్యులేషన్స్​ (టీసీసీసీపీఆర్​)-2018 ప్రవేశంతో ఎస్​ఎంఎస్​లపై ఛార్జీల అవసరం లేకుండా పోయింది. టెలీకమ్యూనికేషన్​ టారిఫ్ ముసాయిదాలో 54వ సవరణలో పేర్కొన్న 50 పైసల ఛార్జీలను తొలగించాలని ప్రతిపాదనలు చేశాం. "

-ట్రాయ్​

ఈ ప్రతిపాదనపై టెలికాం సంస్థలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు మార్చి 3ను తుది గడువుగా నిర్ణయించింది ట్రాయ్​.

Last Updated : Mar 1, 2020, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details