తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రాయ్​: 'పోర్టబిలిటీ' అమలు గడువు పొడిగింపు - టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నియమాల అమలు గడువును నవంబర్​ 11 వరకు పొడిగిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ నిర్ణయం తీసుకుంది. టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్ల విజ్ఞప్తి మేరకు ట్రాయ్​.... గడువు పొడిగించింది.

ట్రాయ్​: 'పోర్టబిలిటీ' అమలు గడువు పొడిగింపు

By

Published : Sep 27, 2019, 9:40 PM IST

Updated : Oct 2, 2019, 6:42 AM IST

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నియమాల అమలు గడువును నవంబర్​ 11 వరకు పొడిగిస్తూ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ నిర్ణయం తీసుకుంది. మొబైల్ నంబర్ మారకుండానే వేరే ఆపరేటర్​కు మారే ఈ నూతన విధానానికి సెప్టెంబర్​ 30 వరకు మాత్రమే గడువు ఉండగా.. తాజాగా దానిని ట్రాయ్ పెంచింది.

కొత్త ప్రక్రియలోకి మారేందుకు చాలా ముందస్తు పరీక్షలు చేయాల్సి ఉన్నందున గడువు పొడిగించాలని టెలికాం ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లు ట్రాయ్​కు విజ్ఞప్తి చేశారు. తక్కువ సమయంలో ఈ పరీక్షలు అన్నీ చేయడం సాధ్యం కాదని అవి వివరించడం వల్ల ట్రాయ్​ తాజా నిర్ణయం తీసుకుంది.

నిబంధనలు సులభతరం చేస్తూ...

మొబైల్ నంబర్ పోర్టబిలిటీని మరింత సులభతరం చేస్తూ ట్రాయ్​ 2018 డిసెంబర్​లో నిబంధనలు రూపొందించింది. మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం సహా ఇది పూర్తి కావడానికి ఉన్న గడువును 7 రోజుల నుంచి 2 రోజులకు తగ్గిస్తూ నిబంధనల్లో మార్పు చేసింది.

ఇదీ చూడండి: బంపర్​ ఆఫర్​: మారుతీ 'బాలెనో ఆర్​ఎస్'​పై భారీ తగ్గింపు

Last Updated : Oct 2, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details