తెలంగాణ

telangana

By

Published : Mar 5, 2020, 10:21 AM IST

Updated : Mar 5, 2020, 3:37 PM IST

ETV Bharat / business

కరోనాతో భారత్​కు ఎంత నష్టమో తెలుసా..?

రానున్న నెలల్లో ప్రపంచ ఎగుమతులు 50 బిలియన్​ డాలర్ల మేర తగ్గుతాయని ఐరాస ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కరోనా కారణంగా చైనాలో ఉత్పత్తి మందగించిన నేపథ్యంలో ఆ తీవ్రత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడుతోందని వారు తెలిపారు. కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయే దేశాల జాబితాలో భారత్ ఒకటని, మొత్తం 348 మిలియన్ డాలర్ల మేర నష్టపోతుందని అంచనా వేసింది.

Trade impact of Coronavirus epidemic for India estimated at 348 million dollars: UN report
ప్రపంచ ఎగుమతులపై కరోనా ప్రభావం

కరోనా వ్యాప్తితో చైనాలో ఏర్పడిన ఉత్పత్తి మందగమనం.. రానున్న నెలల్లో ప్రపంచ ఎగుమతులను 50 బిలియన్​ డాలర్ల మేరకు తగ్గిస్తుందని ఐరాస ఆర్థికవేత్తలు తెలిపారు. ముఖ్యంగా కరోనా వల్ల ప్రభావితమయ్యే మొదటి 15 ఆర్థికవ్యవస్థల్లో భారత్​ కూడా ఒకటని స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా 348 మిలియన్ డాలర్ల మేర భారత్​ నష్టపోతుందని అంచనా వేశారు.

ఐక్యరాజ్యసమితి వాణిజ్య, పెట్టుబడులు, అభివృద్ధి సమావేశం ​(యూఎన్​సీటీఏడీ) తాజా నివేదిక ప్రకారం.. ఐరోపా సమాఖ్య, అమెరికా, జపాన్ ఎగుమతుల్లో కోతపడి తీవ్రంగా నష్టపోనున్నాయి.

ప్రపంచ ఆర్థికవ్యవస్థల్లో... ఐరోపా సమాఖ్య (15.6 బిలియన్ డాలర్లు), అమెరికా (5.8 బిలియన్ డాలర్లు), జపాన్ (5.2 బిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (3.8 బిలియన్ డాలర్లు), తైవాన్ (2.6 బిలియన్ డాలర్లు), వియత్నాం (2.3 బిలియన్ డాలర్లు) మేర నష్టపోనున్నాయి.

ప్రభావిత రంగాలు

కరోనా వల్ల అత్యంత ప్రభావితమయ్యే రంగాల్లో (ప్రిసిషన్ ఇన్​స్ట్రుమెంట్స్) పరికరాలు, యంత్రాలు, ఆటోమోటివ్, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

అవాంఛిత సెలవులు

కరోనా భయాలతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటలీలో ఈ అంటువ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా పాఠశాలలు మూసివేస్తున్నారు.

కరోనా 'చైనా'

చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వల్ల ఇప్పటి వరకు 3,200 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 92,000 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. దీని వల్ల చైనా ఆర్థికవ్యవస్థ మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా గణనీయంగా మందగించే అవకాశముందని ఐరాస స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అంటువ్యాధి నివారణకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎం​ఎఫ్)​ పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి:కొనుగోళ్ల మద్దతుతో స్వల్ప లాభాల్లో మార్కెట్లు

Last Updated : Mar 5, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details