ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని(ఈవీ-ఎస్‌యూవీ) ఆవిష్కరించింది. షాంఘై ఆటో షోలో 'బీజెడ్-4ఎక్స్' పేరుతో ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆర్ఏవీ-4ను పోలి ఉన్న ఈ డిజైన్.. ఫోక్స్‌వ్యాగన్-ఏజీకి గట్టి పోటీనిస్తుందని ఆటో మొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
4 ఏళ్లలో.. 15మోడళ్లు..
2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడు 'బీ-జెడ్' సిరీస్ మోడళ్లు సహా.. మొత్తం 15 ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు టొయోటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మసాహికో మైడా వెల్లడించారు.
ప్రస్తుతం బీ-జెడ్4ఎక్స్ సిరీస్‌ను జపాన్, చైనాల్లో ఉత్పత్తి చేసి.. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని టొయోటా ప్రణాళికలు రచిస్తోంది. బీ-జెడ్4ఎక్స్ మోడల్లో సంప్రదాయ స్టీరింగ్ స్థానంలో విలక్షణమైన వీల్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్ బ్యాటరీని సోలార్‌తో ఛార్జ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి:ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి షియోమీ!
పోటీకి అనుగుణంగా..