తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈవీ మార్కెట్​లోకి 'టొయోటా' గ్రాండ్ ఎంట్రీ.. 30 కొత్త కార్లతో... - విద్యుత్తు వాహనాలు

Toyota electric car: జపాన్​కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా.. 30 రకాల ఎలక్ట్రిక్​ కార్లను మార్కెట్లో తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అందులో ఎస్​యూవీ, క్రాస్​ఓవర్స్​, కాన్సెప్ట్స్​, స్పోర్ట్​ కార్స్​, పికప్​ ట్రక్కులు వంటివి ఉన్నాయి. మరి మార్కెట్లోకి ఎప్పుడొస్తాయి?

electric cars
ఈవీ రంగంలోకి 'టొయోటా'

By

Published : Dec 19, 2021, 5:32 PM IST

Toyota electric car: ప్రస్తుతం అంతర్జాతీయంగా విద్యుత్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతున్న క్రమంలో.. జపాన్​కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ టొయోటా ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే దశాబ్ద కాలంలో 30 కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్​ క్రాస్​ఓవర్స్​, ఎస్​యూవీ, కాన్సెప్ట్స్​, పికప్​ ట్రక్కు, స్పోర్ట్స్​ కార్స్​ మోడల్స్​ను తీసుకొస్తోంది.

ఎలక్ట్రిక్​ బిజినెస్​ మోడల్​ ప్రణాళికలో భాగంగా 2030 నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది టొయోటా. అందులో 2025 నాటికే సగం వాహనాలను విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.

టొయోటా నుంచి వచ్చే చిన్న సైజ్​ ఎలెక్ట్రిక్​ ఎస్​యూవీ

2035 నాటికి ఎలక్ట్రిక్​ బ్రాండ్​గా..

ఇందులో భాగంగా అదనంగా బ్యాటరీ వెహికిల్​ టెక్నాలజీలో 17.6 బిలియన్​ డాలర్లు పెట్టుబడి పెడుతోంది టొయోటా. గతంలో 13.6 బిలియన్​ డాలర్లుగా నిర్ణయించినప్పటికీ తాజాగా పెంచింది. ఈ చర్యతో అంతర్జాతీయంగా సంస్థ ప్రాతినిధ్యం పెరుగుతుందని భావిస్తోంది. అలాగే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లను ఈవీ ప్లాంట్స్​గా మార్చే ఆలోచన సైతం ఉన్నట్లు తెలుస్తోంది. 2035 నాటికి టొయోటా-లెక్సస్​ బ్రాండ్​ పూర్తిగా ఎలక్ట్రిక్​గా మారనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

టొయోటా బీజెడ్​ కాంపాక్ట్​ ఎస్​యూవీ.. ఈ బ్రాండ్​లో అత్యంత తక్కువ ధర ఎలక్ట్రిక్​ కారు

ఎలక్ట్రిక్​ ప్రణాళికల్లో భాగంగా పలు రకాల మోడల్స్​ను ప్రదర్శించింది టొయోటా. అందులో సెడాన్స్​, స్పోర్ట్స్​ కార్స్​, క్రాస్​ఓవర్స్​, ఎస్​యూవీలు, పికప్​ ట్రక్కులతో పాటు షటిల్​ బస్సులు సైతం ఉన్నాయి. కానీ, వారి పూర్తి వివరాలను వెల్లడించలేదు సంస్థ.

టొయోటా ఎలక్ట్రిక్​ స్పోర్ట్స్​ కార్​..

మరోవైపు.. 700 కిలోమీటర్ల రేంజ్​తో లెక్సస్​ స్పోర్ట్​ కార్​ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆ కారు కేవలం 2 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. టొయోటా తొలి లాంగ్​ రేంజ్​ ఈవీ, బీజడ్​4ఎక్స్​ కాంపాక్ట్స్​ ఎస్​యూవీ కారును 2022 మధ్య నాటికి అమెరికాలో విడుదల చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు.

ఇదీ చూడండి:కియా నుంచి కొత్త మోడల్.. 'కారెన్స్​' లుక్​ అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details