కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించాక వాటిపై విధిస్తున్న పన్నుల శాతం(total tax on petrol) 50, 40కి దిగొచ్చింది. పలు రాష్ట్రాల్లో వ్యాట్‌ను కూడా తగ్గించడం వల్ల ఈ పన్నుల శాతం అక్కడ ఇంకాస్త తక్కువగానే ఉంది(total tax on diesel).
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరకు రవాణా ఛార్జీలు జోడిస్తే అది ప్రాథమిక ధర. దీనికి కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్, డీలర్లకు చెల్లించే కమీషన్‌ను జతచేసి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరను నిర్ణయిస్తారు.
చమురు ధరలు తగ్గడానికి ముందు నవంబర్ 3వరకు లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధించేది(total tax on petrol in india). దిల్లీ ప్రభుత్వం 30శాతం వ్యాట్ వసూలు చేసింది. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్‌పై పన్నుల శాతం 54గా ఉండేది. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకంలో కోత విధించి పెట్రోల్ ధరను రూ.5 తగ్గించాక ఇది 50శాతానికి దిగొచ్చింది. కేంద్రం నిర్ణయం తర్వాత దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై పన్నుల శాతం 50 కంటే ఇంకాస్త తక్కువగానే ఉంది.
అలాగే డీజిల్‌పై కూడా కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.31.8గా ఉండేది. దిల్లీ ప్రభుత్వం విధించే 16.75శాతం వ్యాట్, ఎయిర్ యాంబియెన్స్ ఛార్జీతో కలిపి డీజిల్‌పై పన్నుల శాతం నవంబర్ 3వరకు 48శాతంగా ఉంది(total tax on diesel in india). అయితే కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో రూ.10 కోత విధించాక దీనిపై పన్నుల శాతం దిల్లీలో 40శాతానికి దిగొచ్చింది. వ్యాట్ తగ్గించిన ఇతర రాష్ట్రాల్లో ఈ శాతం ఇంకా తక్కువే.
చుమురు ధర, రవాణా ఛార్జీలతో కలిపి కనీస ఇంధన ధర రూ.52 నుంచి రూ.59.89 మధ్య ఉంటుంది(petrol diesel price). రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఈ ధరలో వ్యత్యాసం ఉంటుంది. అయితే కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల వ్యాట్‌తో కలిపి చమురు ధరలు పెరుగుతాయి(petrol price in india).
రాజస్థాన్లో అత్యధికం..
రాజస్థాన్ పెట్రోల్‌పై అత్యధికంగా రూ.30.51వ్యాట్ విధిస్తోంది. ఆ తర్వాత మహరాష్ట్ర రూ.29.99, ఆంధ్రప్రదేశ్ రూ.29.02, మధ్యప్రదేశ్ రూ.26.87 వ్యాట్ రూపంలో వసూలు చేస్తున్నాయి. అత్యల్పంగా అండమాన్ నికోబార్ పెట్రోల్‌పై రూ.4.93 మాత్రమే వ్యాట్ విధిస్తోంది.
డీజిల్ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా రూ.21.19 వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ తర్వాత రాజస్థాన్ రూ.21.14, మహారాష్ట్ర రూ.20.21 వ్యాట్ విధిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ డీజిల్‌పై అత్యల్పంగా రూ.4.40 వ్యాట్ వసూలు చేస్తోంది. ఆ తర్వాత అండమాన్ నికోబార్‌లో ఇది రూ.4.58గా ఉంది.