తెలంగాణ

telangana

ETV Bharat / business

అదానీతో కలిసి టోటల్​ ఎస్​​ఏ రూ.3,707 కోట్లు పెట్టుబడి

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్​తో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎస్​ఏ... సోలార్ ఎనర్జీ జాయింట్ వెంచర్​లో రూ.3,707 కోట్లు పెట్టుబడి పెట్టింది. భారత్​లోని 11 రాష్ట్రాల్లో 2,148 మెగావాట్ల ఆపరేటింగ్ సోలార్ ప్రాజెక్ట్ చేపట్టడమే ఈ జాయింట్ వెంచర్ లక్ష్యమని టోటల్​ తెలిపింది.

Total invests Rs 3,707 cr in solar energy joint venture of Adani
సోలార్ ఎనర్జీ జాయింట్ వెంచర్​ కోసం చేతులు కలిపిన అదానీ-టోటల్​

By

Published : Apr 8, 2020, 9:06 AM IST

ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎస్​ఏ, అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్​)తో కలిసి సోలార్ ఎనర్జీ జాయింట్ వెంచర్​లో రూ.3,707 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదానీ గ్రూప్​తో కలిసి టోటల్ ఎస్​ఏ... భారత్​లో పెట్టుబడి పెట్టడం ఇది మూడోసారి.

భారత్​లోని 11 రాష్ట్రాల్లో 2,148 మెగావాట్ల ఆపరేటింగ్ సోలార్ ప్రాజెక్ట్ చేపట్టడమే ఈ జాయింట్ వెంచర్ లక్ష్యం. ఇందులో 50 శాతం భాగస్వామ్యం కోసం టోటల్​ ఎస్ఏ... రూ.3,707 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.

భారత్​లో పాగా వేసేందుకు...

ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ధమ్రా వద్ద సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల ఎల్​ఎన్​జీ (లిక్విడ్​ నేచురల్ గ్యాస్​) ఉత్పత్తి సామర్థ్యం ఉన్న టెర్మినల్​ను అదానీ గ్రూప్ నిర్మిస్తోంది. ఇందులో 50 శాతం వాటాను గతేడాదే టోటల్ ఎస్​ఏ స్వాధీనం చేసుకుంది.

ఆటోమొబైల్స్​కు రిటైల్​గా సీఎస్​జీ, గృహవినియోగదారులకు సహజవాయు సరఫరా చేసే అదానీ గ్యాస్​లో.. టోటల్ 37.4 శాతం వాటాను కొనుగోలు చేసింది. అంతే కాకుండా అదానీతో కలిసి భారత్​ అంతటా పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయాలని టోటల్ చూస్తోంది.

862 మిలియన్​ డాలర్ల సేకరణ..

తమ జాయింట్​ వెంచర్​లో 2.148 గిగావాట్స్ ఆపరేటింగ్ సోలార్ ప్రాజెక్టులు ఉన్నాయని ఏజీఈఎల్-టోటల్​లు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ పోర్టుఫోలియోలో గ్రూప్ 1, గ్రూప్​ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందు కోసం ఇటీవలే ఈ కంపెనీలు అంతర్జాతీయ బాండ్ మార్కెట్ల నుంచి 862.5 మిలియన్ డాలర్లు సేకరించాయి.

వాతావరణ కాలుష్యం సమస్యను పరిష్కరించే దిశగా... 2025 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్​ఫోలియోను కలిగి ఉండడమే లక్ష్యంగా ఏజీఈఎల్ పనిచేస్తోంది.

ఇదీ చూడండి:ఎస్​బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు... వారికి నష్టం, వీరికి లాభం...

ABOUT THE AUTHOR

...view details