తెలంగాణ

telangana

ETV Bharat / business

తొలిసారి ల్యాప్​టాప్​లతో 'ఎంఐ'.. ధరలివే

ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ షియోమీ.. తన ఎమ్​ఐ బ్రాండ్​తో సరికొత్త ల్యాప్​టాప్​ల​ను భారతీయ విపణిలోకి తీసుకొచ్చింది. ఎమ్​ఐ నోట్​బుక్​ 14 సిరీస్​లో రెండు మోడళ్లను విడుదల చేసింది. వాటి ఖరీదు రూ.41,999 నుంచి 59,999 వరకు ఉంది.

Xiaomi Mi Notebook latest news
తొలిసారి ల్యాప్​టాప్​లతో వచ్చిన ఎంఐ.. ధరలపై లుక్కేయండి

By

Published : Jun 11, 2020, 3:12 PM IST

Updated : Jun 11, 2020, 8:08 PM IST

ఇంటి నుంచి పనిచేసే వారికి అనుకూలంగా ఉండేలా సరికొత్త ల్యాప్​టాప్​లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది షియోమీ సంస్థ. రెండు మోడళ్లలో ఒక దానిలో మూడు, మరో దానిలో రెండు వేరియంట్లు ఉన్నాయి. జూన్​ 17 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. జులై 16 వరకు ధరలు ఇలా ఉండనున్నాయి.

ఎంఐ నోట్​బుక్​ 14..

ఇది మూడు వేరియంట్లలో విడుదలైంది.

8 జీబీ ర్యామ్ (డీడీఆర్​4)​ + 246 జీబీ సాటా ఎస్​ఎస్​డీ - రూ. 41,999

8 జీబీ ర్యామ్ (డీడీఆర్​4​)+ 512 జీబీ సాటా ఎస్​ఎస్​డీ - రూ. 44,999

8 జీబీ ర్యామ్ (డీడీఆర్​4)+ 512 జీబీ సాటా ఎస్​ఎస్​డీ + నివిడా జీ ఫోర్స్​ ఎమ్​ఎక్స్​ 250 (గ్రాఫిక్​ కార్డ్​)- రూ. 47,999

ఎంఐ నోట్​బుక్​ 14

ఎంఐ నోట్​బుక్​ 14 హారిజన్​ ఎడిషన్​..

ఇది రెండు వేరియంట్లలో విడుదలైంది.

8 జీబీ ర్యామ్ (డీడీఆర్​4)+ 512 జీబీ సాటా ఎస్​ఎస్​డీ, ఇంటెల్​ ఐ5 (10వ జనరేషన్​) ప్రాసెసర్​ - రూ. 54,999

8 జీబీ ర్యామ్ (డీడీఆర్​4)+ 512 జీబీ సాటా ఎస్​ఎస్​డీ, ఇంటెల్​ ఐ7 (10వ జనరేషన్​) ప్రాసెసర్​ - రూ. 59,999

ఎంఐ నోట్​బుక్​ 14 హారిజన్​ ఎడిషన్​..

ఈ నోట్‌బుక్‌ బరువు 1.35 కిలోగ్రాములు. 13.3 అంగులాల డిస్​ప్లే ఉంది. ఒకసారి బ్యాటరీని పూర్తి ఛార్జింగ్‌ చేస్తే 10 గంటలపాటు వాడుకోవచ్చు.

ఇదీ చూడండి: ఆండ్రాయిడ్​ 11 వచ్చేసింది.. ఎవరు వాడొచ్చంటే?

Last Updated : Jun 11, 2020, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details