భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. చాలా మంది రూ.15 వేల లోపు ధరతో.. మంచి ఫీచర్లు, భారీ కెమెరా (పిక్సెళ్ల పరంగా) ఉన్న ఫోన్ కొనుగోలు చేసిందుకు మొగ్గు చూపుతారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బడ్జెట్ సెగ్మెంట్లో కొత్త కొత్త మోడళ్లను దించుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సెగ్మెంట్లో పోటీతత్వం పెరిగి.. ఉత్తమ ఫీచర్లు ఉన్న మోడళ్లు అందుబాటులో ధరలో లభిస్తున్నాయి.
మరి ప్రస్తుతం మార్కెట్లో.. రూ.15వేల లోపు ధర ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
రెడ్ మీ నోట్ 10..
బడ్జెట్ సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో సరికొత్త ఫోన్లను విడుదల చేసే కంపెనీల్లో షియోమీ ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే రెడ్ మీ నోట్ 10ను విడుదల చేసింది.
ఫీచర్లు..
- 6.43 అంగుళాల డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- వెనుక నాలుగు కెమెరా (48ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
- 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- ప్రారంభ ధర రూ.11,999
మోటోరోలా మోటో జీ30
మోటో జీ30 సరికొత్త డిజైన్‌తో విడుదలైంది. డ్యూడ్రాప్ నాచ్ దీని ప్రత్యేకత. దీనికి ఐపీ52 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది. సాప్ట్వేర్ క్లీన్‌గా , బోట్వేర్ లేకుండా ఉంటుంది.
ఫీచర్లు..
- 6.50 అంగుళాల డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- వెనుక వైపు నాలుగు కెమెరాలు (64ఎంపీ+ 8ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
- 13 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- రూ.10,999 ప్రారంభ ధర
పోకో ఎం3
ఇందులో కూడా డ్యూడ్రాప్ నాచ్ డిస్ప్లే ఉంది. బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ దీని సొంతం.
ఫీచర్లు..
- 6.53 అంగుళాల డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- 48ఎంపీ+ 2ఎంపీ + 2ఎంపీ వెనుక కెమెరా
- 8 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- ప్రారంభ ధర - రూ.10,999
పోకో ఎక్స్ 3
భారీ బ్యాటరీ, అధునాతన ప్రాసెసర్‌తో పోకో ఎక్స్ 2 మార్కెట్లోకి వచ్చింది. సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ.
ఫీచర్లు..
- 6.67 అంగుళాల డిస్ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
- 30 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- వెనుకవైపు 4 కెమెరాలు (64ఎంపీ+ 13ఎంపీ + 2ఎంపీ + 2ఎంపీ)
- ప్రారంభ ధర - రూ.14,999