తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతీ కార్లలో బెస్ట్ సెల్లర్స్​ ఇవే... - మారుతీ సుజుకీలో బెస్ట్ సెల్లింగ్​ కార్లు

వరుసగా నాలుగో సంవత్సరం (2020-21) కూడా తమ బెస్ట్ సెల్లింగ్ కార్లలో మార్పు లేదని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. 1.72 లక్షల యూనిట్లు అమ్ముడైన 'స్విఫ్ట్' మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మిగతా మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Best selling cars in Maruti Suzuki
మారుతీ సుజుకీలో ఎక్కువగా అమ్మడవుతున్న కార్లు

By

Published : Apr 13, 2021, 2:18 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడైన కార్ల జాబితాను ప్రకటించింది దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ. గత నాలుగేళ్లలో టాప్​ 5 బెస్ట్​ సెల్లింగ్ కార్లలో మార్పు లేదని వెల్లడించింది.

ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్​లో మొదటి 4, టాప్-10లో.. 7 మోడళ్లు తమవేనని మారుతీ సుజుకీ పేర్కొంది.

2020-21లో టాప్​ 5 బెస్ట్​ సెల్లింగ్ కార్లు..

గత ఆర్థిక సంవత్సరం 1.72 లక్షల విక్రయాలతో 'స్విఫ్ట్'​ మొదటి స్థానాన్ని సాధించింది.

స్విఫ్ట్

1.63 యూనిట్లు అమ్ముడైన 'బాలినో' రెండో స్థానంలో నిలిచింది.

బాలినో

మూడో స్థానంలోని.. 'వ్యాగన్​ ఆర్'​ కార్లు 1.60 లక్షలు అమ్ముడయ్యాయి.

వ్యాగన్​అర్​

1.59 లక్షల విక్రయాలతో ఆల్టో, 1.28 లక్షల అమ్మకాలతో డిజైర్​ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

ఆల్టో
డిజైర్​

ఇదీ చదవండి:వాట్సాప్​పై సైబర్​ నేరగాళ్ల కన్ను- ఏకంగా ఖాతా ఉఫ్​!

ABOUT THE AUTHOR

...view details